హైదరాబాద్, 28 జూన్ (హి.స.)
ఎన్నికల మందు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హడావుడి చేశారని, ఇప్పుడు అది ఎక్కడికి పోయిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రశ్నించారు. శనివారం నాడు తెలంగాణ భవన్ లో నిరుద్యోగులు ఆయనతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తమ పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ మద్దుతు ఇవ్వాలని కోరారు. అనంతరం హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున యువతకు సంపూర్ణ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లక్షా 62 వేల ఉద్యోగాలు ఇచ్చామని గుర్తు చేశారు.ప్రియాంక జీ.. సీఎంకు మొట్టికాయలు వేయాలి..ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రానికి వచ్చిన ప్రియాంక గాంధీ ఏడాదిలోపు అన్ని ఉద్యోగాల భర్తీకి మాటిస్తున్నానని చెప్పారనే విషయాన్ని హరీశ్ రావు గుర్తు చేశారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..