ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు బీజేపీ అధ్యక్షుల
హైదరాబాద్, 28 జూన్ (హి.స.) తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల నియామకాలకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఒకే రోజు బీజేపీ అధిష్ఠానం అధ్యక్షులను ప్రకటించనుంది. బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదలైంది. మూడ
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు బీజేపీ అధ్యక్షుల


హైదరాబాద్, 28 జూన్ (హి.స.)

తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల నియామకాలకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఒకే రోజు బీజేపీ అధిష్ఠానం అధ్యక్షులను ప్రకటించనుంది. బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదలైంది. మూడు రోజుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని అధిష్ఠానం నిర్ణయించింది. బీజేపీ రాష్ట్ర ఎన్నికల అధికారి, ఎంపీ పాకా సత్యనారాయణ విజయవాడలో ఈరోజు మీడియా సమావేశం నిర్వహించి.. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించారు.

పాకా సత్యనారాయణ మాట్లాడుతూ… ‘అంతర్గత ప్రజాస్వామ్యం పాటిస్తున్న ఏకైక పార్టీ బీజేపీ. రేపు అధ్యక్ష ఎన్నిక నోటిఫికేషన్ జారీ అవుతుంది. 30న ఉదయం 11 నుంచి 1 వరకూ నామినేషన్ స్వీకరణ ప్రక్రియ ఉంటుంది. 30న మధ్యాహ్నం 1 నుంచి 2 వరకూ నామినేషన్ల స్క్రూటిని నిర్వహిస్తారు. సాయంత్రం 4 లోపు ఉపసంహరణకు గడువు. జూలై 1న అధ్యక్ష ప్రకటన, బాధ్యతల స్వీకరణ ఉంటుంది. జాతీయ కౌన్సిల్ పీసీ మోహన్ ఎన్నికల అబ్జర్వర్‌గా ఉంటారు’ అని చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande