నిరుద్యోగులకు తీపి కబురు.. 607 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్, 28 జూన్ (హి.స.) నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రధాన యూనివర్సిటీల్లో మొత్తం 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఇవాళ మెడికల్ అండ్ హెల్ట్ సర్వీసెస్
తెలంగాణ సర్కార్


హైదరాబాద్, 28 జూన్ (హి.స.)

నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్

మరో గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రధాన యూనివర్సిటీల్లో మొత్తం 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఇవాళ మెడికల్ అండ్ హెల్ట్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఉస్మానియా యూనివర్శిటీ పరిధిలో, శాతవాహన యూనివర్శిటీ, కాకతీయ యూనివర్శిటీ, పాలమూరు యూనివర్శిటీ ల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాల ప్రక్రియ ప్రారంభం కానుంది. దరఖాస్తులను జూలై 10 నుంచి స్వీకరించబోతున్నామని వెల్లడించారు. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ జూలై 17, సాయంత్రం 5 గంటల వరకు అని పేర్కొన్నారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande