అరేబియా సముద్రంలో .ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం తో అల్పపీడనం ఏర్పడింది
, విశాఖపట్నం, 29 జూన్ (హి.స.): అరేబియా సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో శనివారం అల్పపీడనం ఏర్పడింది. మరోవైపు బంగాళాఖాతంలోనూ ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆదివారం అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. ఇది నెమ్మదిగా పశ్చిమ-వాయవ్య దిశగా వె
అరేబియా సముద్రంలో .ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం తో అల్పపీడనం ఏర్పడింది


, విశాఖపట్నం, 29 జూన్ (హి.స.): అరేబియా సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో శనివారం అల్పపీడనం ఏర్పడింది. మరోవైపు బంగాళాఖాతంలోనూ ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆదివారం అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. ఇది నెమ్మదిగా పశ్చిమ-వాయవ్య దిశగా వెళ్తూ గంగా పరివాహక పశ్చిమబెంగాల్, ఉత్తర ఒడిశా, ఝార్ఖండ్‌ వైపు కదలొచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. వీటి ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడే అవకాశముందని ఐఎండీ తెలిపింది. సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో మత్స్యకారులు ఆదివారం వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande