జూలై 1 నుంచి సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల సమ్మె
హైదరాబాద్, 29 జూన్ (హి.స.) తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల అసోసియేషన్ (TSRDA) జూలై 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేపట్టనుంది. ఈ మేరకు టీఎస్ఆర్టీఏ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఎన్నోసార్లు ప్రభుత్వ
డాక్టర్ల సమ్మె


హైదరాబాద్, 29 జూన్ (హి.స.)

తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల అసోసియేషన్ (TSRDA) జూలై 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేపట్టనుంది. ఈ మేరకు టీఎస్ఆర్టీఏ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఎన్నోసార్లు ప్రభుత్వం, వైద్య శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్లిన పట్టించుకోవడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ వైద్య కళాశాలలు మరియు ఆసుపత్రుల్లో పని చేస్తున్న సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు గత మూడు నెలలుగా స్టైపెండ్ చెల్లించకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.

ఐదు నెలలుగా పెండింగ్లో ఉన్న స్టైపెండ్ పెంపు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు, అలాగే రెసిడెంట్ల ఉద్యోగ కాలాన్ని కొనసాగించేందుకు కీలకమైన ఎక్స్టెన్షన్ జీవో ఇంకా విడుదల చేయబడలేదని వాపోయారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande