బిజెపి అధ్యక్షుడి నియామకంపై అర్వింద్ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్, 30 జూన్ (హి.స.) తెలంగాణ బీజేపీ చీఫ్ నియామకంపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ హైకమాండ్ నిర్ణయానికి తాము పూర్తిగా కట్టబడి ఉన్నట్లు చెప్పారు. ఇవాళ నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.
ధర్మపురి అరవింద్


హైదరాబాద్, 30 జూన్ (హి.స.)

తెలంగాణ బీజేపీ చీఫ్ నియామకంపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ హైకమాండ్ నిర్ణయానికి తాము పూర్తిగా కట్టబడి ఉన్నట్లు చెప్పారు. ఇవాళ నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. పార్టీ తరఫున ఎవరు నామినేషన్ వేసినా మా మద్దతు ఉంటుందని, పార్టీ నిర్ణయమే మా నిర్ణయం అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన వారికి సహకరిస్తామని రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించామన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande