పేదల జోలికొస్తే ఊరుకునేది లేదు.. హైడ్రాపై ఎంపీ ఈటల రాజేందర్
హైదరాబాద్, 30 జూన్ (హి.స.) నగరంలో ''హైడ్రా'' కూల్చివేతలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పేదోళ్ల ఇండ్ల కూల్చివేతలపై మరోసారి మల్కాజ్గరి ఎంపీ ఈటల రాజేందర్ సర్కార్పై ధ్వజమెత్తారు. ఇవాళ ఆయన జవహర్ నగర్ లో మాట్లాడుతూ.. 30, 60 గజాల్లో ఇళ్లు కట్టుకు
ఎంపీ ఈటల రాజేందర్


హైదరాబాద్, 30 జూన్ (హి.స.)

నగరంలో 'హైడ్రా' కూల్చివేతలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పేదోళ్ల ఇండ్ల కూల్చివేతలపై మరోసారి మల్కాజ్గరి ఎంపీ ఈటల రాజేందర్ సర్కార్పై ధ్వజమెత్తారు. ఇవాళ ఆయన జవహర్ నగర్ లో మాట్లాడుతూ.. 30, 60 గజాల్లో ఇళ్లు కట్టుకుంటోడు ఉన్నోడా, లేనోడా ముర్ఖుల్లారా అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి కళ్లు కనబడటం లేదా అంటూ ఫైర్ అయ్యారు. బంజారా హిల్స్ లో ఎకరా రూ.50 కోట్లు, రూ.60 కోట్లు, రూ.100 కోట్ల భూములను కాంగ్రెస్ నేతలు కబ్జా చేసి ఆక్రమించారని ఆరోపించారు. వాటిని రిజిస్టర్ చేయడానికి జీవో నెం.58,59 తీసుకొచ్చారు కద.. అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. పేదోళ్ల బతుకుల్లో మట్టి కొడితే ఏమోస్తుందని అన్నారు. రేవంత్ ప్రభుత్వం పేదల జీవితాలతో చెలగాటం ఆడుతోందని, వారి ఉసురు తప్పక తగులుతుందని పేర్కొన్నారు. లంచాలు ఇవ్వకపోతే గద్దల్లా వాలిపోయి కూల్చేస్తున్నారని ఇళ్లను నేలమట్ట చేస్తున్నారని మండిపడ్డారు. ఇకనైనా నిరుపేదల విషయంలో సర్కార్ పిచ్చి వేషాలు మానేయాలని.. లేని పక్షంలో భారీ ఉద్యమం తప్పదని ఎంపీ ఈటల రాజేందర్ హెచ్చరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande