పాశమైలారం ప్రమాదం పై స్పందించిన కిషన్ రెడ్డి
హైదరాబాద్, 30 జూన్ (హి.స.) సంగారెడ్డి జిల్లాలోని పాశమైలారం పారిశ్రామికవాడ అగ్ని ప్రమాదంపై కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ మేరకు ఆయన తన ట్వీట్లో పాశమైలారం పారిశ్రామికవాడ ప్రమాదం చాలా బాధ కలిగించి
కిషన్ రెడ్డి


హైదరాబాద్, 30 జూన్ (హి.స.)

సంగారెడ్డి జిల్లాలోని

పాశమైలారం పారిశ్రామికవాడ అగ్ని ప్రమాదంపై కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ మేరకు ఆయన తన ట్వీట్లో పాశమైలారం పారిశ్రామికవాడ ప్రమాదం చాలా బాధ కలిగించింది. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. నేను జిల్లా యంత్రాంగం తో మాట్లాడి వెంటనే సహాయక చర్యలు తీసుకోవాలని, అవసరమైన వైద్య సహాయం అందించాలని వారిని కోరాను. ఈ సంఘటనలో బాధిత కుటుంభాలకు భారత ప్రభుత్వం సంఘీభావంగా నిలుస్తుంది. అలాగే మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తుంది. అని కిషన్ రెడ్డి రాసుకొచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande