హైదరాబాద్, 30 జూన్ (హి.స.)
పాశమైలారంలోని సీగాచీ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి పలువురు కార్మికులు మరణించడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన గురించి సంగారెడ్డి కలెక్టర్, జిల్లా ఎస్పీలతో రేవంత్ ఫోన్ లో మాట్లాడారు.. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు.. సహాయ కార్యక్రమాలు వేగవంతం చేయాలని ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యసాయం అందించాలని అధికారులను కోరారు. అలాగే మృతి చెందిన కార్మిక కుటుంబాలను ఆయన తన సానుభూతిని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్