అమరావతి, 30 జూన్ (హి.స.)
నెల్లూరు : సెంట్రల్ జైలులో పలు కేసుల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ కీలకనేత , మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ()ని సోమవారం ముత్తుకూరు పోలీసులు ) కస్టడీ (కి తీసుకున్నారు. కృష్ణపట్నం పోర్టు ( ) వద్ద కంటైనర్ క్యారియర్ నుంచి అనధికారంగా టోల్ వసూళ్ల కేసు లో పోలీసులు ప్రశ్నించనున్నారు. దీంతో కాకాణిని జైలు నుంచి కృష్ణపట్నం పోర్టు పోలీస్ స్టేషన్‌కు తరలించి రెండు రోజుల పాటు విచారించనున్నారు. గతంలో మరో రెండు కేసుల్లో కాకాణిని అయిదు రోజులు పాటు పోలీసులు, సిట్ అధికారులు విచారించారు. అయితే విచారణకు కాకాణి సహాకరించలేదు. ప్రస్తుతం రెండు రోజుల విచారణలో కాకాణి ఎంత వరకు సహాకరిస్తారనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా అనధికార టోల్ గేట్ల ఏర్పాటు కేసులో కాకాణి ఏ1 ముద్దాయిగా ఉన్న విషయం తెలిసిందే.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ