నందమూరి బాలకృష్ణ అఖండ 2'లేటెస్ట్ అప్డేట్..
హైదరాబాద్, 30 జూన్ (హి.స.) టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ తాజాగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ''అఖండ 2'' చేస్తున్నారు. బాలయ్య బోయపాటి కాంబోతో పాటు బ్లాక్బస్టర్ మూవీ అఖండకు సీక్వెల్ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రాజెక్
అఖండ టు


హైదరాబాద్, 30 జూన్ (హి.స.)

టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ తాజాగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ 2' చేస్తున్నారు. బాలయ్య బోయపాటి కాంబోతో పాటు బ్లాక్బస్టర్ మూవీ అఖండకు సీక్వెల్ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రాజెక్టుకు ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ అచంట, గోపీచంద్ అచంట సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. .

దసరా కానుకగా ఈ ఏడాది సెప్టెంబర్ 25న పాన్ ఇండియా లెవల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. కాగా ఈ మూవీ షూటింగ్కి సంబంధించి అప్డేట్ బయటకు వచ్చింది. సమాచారం ప్రకారం తర్వాత షెడ్యూల్ ప్రయాగరాజ్లో ప్లాన్ చేస్తున్నారట. ఇక్కడ దాదాపు రెండు వారాలు అలా షూటింగ్ ప్లాన్ చేస్తున్నారట. ఇలా దాదాపు షూటింగ్ మొత్తం ఫుల్ స్వింగ్ లో కంప్లీట్ అవుతుందట. ప్రస్తుతానికి అయితే ఈ సినిమా రిలీజ్ ని సెప్టెంబర్ 25న గ్రాండ్ గా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande