హైదరాబాద్, 30 జూన్ (హి.స.)
గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ బిజెపికి రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్ష పదవికి నామినేషన్ వెయ్యనివ్వలేదని, అందుకే రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. తన రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించినట్లు తెలిపారు. హైదరాబాద్ లో ఆయన నేడు మీడియాతో మాట్లాడుతూ, పార్టీకి రాజీనామా చేయడంతో తన ఎమ్మెల్యే పదవి రద్దు చేయాలని కోరుతూ స్పీకర్ లేఖ పంపాలని కిషన్ రెడ్డిని కోరినట్లు వెల్లడించారు. పార్టీ కోసం ఎంతోకాలం కష్టపడ్డా, అధికారంలోకి రావాలని ఎంతో కృషి చేశా.. అయినా పార్టీలో గుర్తింపు లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.. పార్టీకి చేసిన సేవ కారణంగా తాను, తన కుటుంబం ఉగ్రవాద హిట్ లిస్ట్ లో ఉన్నామని గుర్తు చేశారు..రాష్ట్రంలో పార్టీ గెలువకూడదని అనుకునే వాళ్లు సంఖ్య రోజు రోజుకి అవుతుందన్నారు. అధ్యక్ష పదవికి నామినేషన్ వేయడానికి వచ్చానని, అయితే వేయకుండా అడ్డుకోవడమే కాకుండా తన మద్దతుదారులను బెదిరించారన్నారు.. పార్టీలో గుర్తింపు, విలువలేనప్పుడు ఇక ఆ పార్టీలో ఉండలేనని అన్నారు. మీకు .. మీ పార్టీకి ఒక దండం అంటూ కమలనానికి గుడ్ బై చెప్పారు
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్