జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గా ఉప్పల శ్రీనివాస్ గుప్తా
తెలంగాణ, సంగారెడ్డి. 30 జూన్ (హి.స.) సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్తా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్
జహీరాబాద్ కాంగ్రెస్


తెలంగాణ, సంగారెడ్డి. 30 జూన్ (హి.స.)

సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్తా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సోోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఇంచార్జ్ గా బాధ్యతలు అప్పగించిన ఏఐసీసీ నాయకులకు, సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఇతర మంత్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు తనకు అప్పగించిన బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహిస్తానని, పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తానన్నారు .

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande