హైదరాబాద్, 30 జూన్ (హి.స.)
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని పరిశ్రమలో జరిగిన ఘోర అగ్నిప్రమాదం పై మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. ఈ మేరకు ఆయన.. అగ్ని ప్రమాదంలో మరణించిన కార్మికుల మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. సంతాపం తెలుపుతూ ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. అందులో పాశమైలారం ప్రమాదంలో మృతుల సంఖ్య ఇంకా పెరగనున్నదనే వార్తల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదానికి కారణాలపై విచారణ జరిపించాలని, అగ్ని ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్య చికిత్స అందించాలని, చనిపోయిన కార్మికులు ఉద్యోగుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వానికి మాజీ సీఎం కేసీఆర్ సూచించారు. అలాగే మరణించిన వారి కుటుంబాలకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్