భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగొద్దు : ఎమ్మెల్యే తలసాని
హైదరాబాద్, 30 జూన్ (హి.స.) బల్కంపేట ఎల్లమ్మ తల్లి కల్యాణ మహోత్సవాలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగ కుండా ఏర్పాట్లు చేయాలని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమ వారం బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద కల్యాణ మహోత్సవ ఏర్పాట్లను
ఎమ్మెల్యే తలసాని


హైదరాబాద్, 30 జూన్ (హి.స.) బల్కంపేట ఎల్లమ్మ తల్లి కల్యాణ మహోత్సవాలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగ కుండా ఏర్పాట్లు చేయాలని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమ వారం బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద కల్యాణ మహోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమ్మవారి కల్యాణానికి లక్షలాది భక్తులకు రానున్నారని, ఉత్సవాల్లో కొత్త పద్ధతులకు తెరదీయొద్దన్నారు.

ఎప్పుడూ అనుసరిస్తున్న విధానాలనే కొనసాగించాలని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా జరిగే పవిత్రకార్యం. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పది సంవత్సరాలు అమ్మవారి కల్యాణం వైభవంగా నిర్వ హించామని గుర్తు చేశారు. ప్రభుత్వం ఎలాంటి భేషజాలకు పోకుండా, ఆటంకాలు కల్పించకుండా అందరి భాగస్వామ్యంతో అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande