తెలంగాణ, మహబూబ్నగర్. 30 జూన్ (హి.స.) మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని వీరన్నపేటలో ఉన్న హెచ్ఎన్ ఫంక్షన్ హాల్ వెనుక ఉన్న గుట్ట పై సోమవారం ఉదయం చిరుత పులి సంచరిస్తుండగా స్థానికులు చూసి భయాందోళనలకు గురయ్యారు. చిరుత కనిపించగానే కొంతమంది చిరుత ఫోటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా, మరికొందరు చిరుత సంచరిస్తున్న గుట్ట సమీపానికి చేరుకొని చిరుత పులిని ఫోటోలు తీయడానికి అన్వేషించారు. స్థానికులు కొందరు సంబంధిత ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించి వెంటనే చర్యలు చేపట్టి చిరుతను బంధించాలని కోరారు. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు