యాదవులకు అండగా ప్రజా ప్రభుత్వం –మంత్రి -అడ్లూరి
తెలంగాణ, పెద్దపల్లి. 30 జూన్ (హి.స.) యాదవులకు అండగా ప్రజా ప్రభుత్వం నిలుస్తుందని, ఇందిరమ్మ రాజ్యంలో నిరుపేదలందరికి సంక్షేమ పథకాల ఫలాలను అందిస్తున్నామని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. సోమవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మం
మంత్రి -అడ్లూరి


తెలంగాణ, పెద్దపల్లి. 30 జూన్ (హి.స.)

యాదవులకు అండగా ప్రజా ప్రభుత్వం నిలుస్తుందని, ఇందిరమ్మ రాజ్యంలో నిరుపేదలందరికి సంక్షేమ పథకాల ఫలాలను అందిస్తున్నామని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. సోమవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని బొమ్మరెడ్డిపల్లి, చామనపల్లి గ్రామాల్లో మరణించిన గొర్రెలకు నష్టపరి హారం చెల్లింపుపుతోపాటు విద్యుత్ రంగంలో పలు వంటి అభివృద్ధి పనులకు మంత్రి అ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్షతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బొమ్మారెడ్డిపల్లి, చామనపల్లి గ్రామాల్లో యాదవులను ఆదుకోవాలనే ఉద్దేశంతో మరణించిన మేకలు గొర్రెలకు నష్టపరిహారం కింద రాష్ట్ర ప్రభుత్వం తరపున 8 లక్షల 70 వేల రూపాయల పరిహారం పంపిణీ చేస్తున్నామన్నారు. ధర్మారం మండలంలో యాదవ సోదరులకు విపత్కర సమయంలో ఆదుకునేందుకు పరిహారం త్వరగా మంజూరు చేసిన కలెక్టర్కు మంత్రి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande