ఖమ్మం జిల్లాలో దారుణం. ఎస్సై భార్య ఆత్మహత్య
ఖమ్మం., 30 జూన్ (హి.స.) ఖమ్మం జిల్లాలో జిఆర్పిఎఫ్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై రాణా ప్రతాప్ భార్య ఆత్మహత్య తీవ్ర కలకలం రేపింది. మృతురాలు రాజేశ్వరి ఇచ్చిన మరణ వాంగ్మూలం ఆధారంగా ఉన్నతాధికారులు నాన్ బెయిల్ బుల్ సెక్షన్ల కింద కేసు నమోదు
ఎస్సై భార్య ఆత్మహత్య


ఖమ్మం., 30 జూన్ (హి.స.) ఖమ్మం జిల్లాలో జిఆర్పిఎఫ్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై రాణా ప్రతాప్ భార్య ఆత్మహత్య తీవ్ర కలకలం రేపింది. మృతురాలు రాజేశ్వరి ఇచ్చిన మరణ వాంగ్మూలం ఆధారంగా ఉన్నతాధికారులు నాన్ బెయిల్ బుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గతంలో కూడా ఎస్సై రాణా ప్రతాప్, తన సోదరుడు మహేష్ లు పాత బస్టాండ్ సమీపంలో రివాల్వర్ తో స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడంతో వారిపై అప్పటి అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. తన తండ్రి కూడా అదే శాఖలో పనిచేసి పదవి విరమణ పొందారు. ఎస్సై రాణా ప్రతాప్ తన భార్యను తీవ్ర ఇబ్బందులకు గురి చేయడంతో రెండు రోజుల క్రితం పురుగుల మందు తాగి నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మరణించింది. ఎస్సై తో సహా కుటుంబ సభ్యులు కలిసి దాడి చేసి చంపారని ఆరోపిస్తూ మృతురాలి బంధువులు ఆందోళన చేశారు. భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటనలో రైల్వే ఎస్ఐ లు రాణా ప్రతాప్, మహబూబాబాద్ జిల్లాలో పనిచేస్తున్న వి ఆర్ ఎస్ ఐ మహేష్ కుటుంబ సభ్యులపై పలు సెక్షన్ క్రింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి,14 రోజుల రిమాండ్ కు తరలించారు. చనిపోయే ముందు రాజేశ్వరి గంటన్నర మరణ వాంగ్మూలాన్ని ఇచ్చారు. దీని ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande