పాశ మైలారం ప్రమాద ఘటన స్థలాన్ని సందర్శించిన హరీష్ రావు
సంగారెడ్డి, 30 జూన్ (హి.స.) సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో జరిగిన అగ్ని ప్రమాద ప్రదేశాన్ని స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, ఇతర నాయకులతో కలిసి మాజీ మంత్రి హరీశ్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలత
హరీష్ రావు


సంగారెడ్డి, 30 జూన్ (హి.స.) సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో జరిగిన అగ్ని ప్రమాద ప్రదేశాన్ని స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, ఇతర నాయకులతో కలిసి మాజీ మంత్రి హరీశ్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో మాట్లాడి.. అక్కడ అందిస్తున్న సహాయక చర్యల గురించి తెలుసుకున్నారు.

అనంతరం హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ఘటన జరిగి ఐదు గంటలు గడుస్తున్నా సహాయక చర్యలు అందించడంలో, కుటుంబ సభ్యులకు వివరాలు తెలుపడంలో ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తంచేశారు. భారీ పేలుడు జరిగి 10 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చెప్పారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande