వేములవాడలో కోడెల మృతి పై హరీష్ రావు ఆగ్రహం
హైదరాబాద్, 4 జూన్ (హి.స.) వేములవాడలో కోడెల మృతి సంఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాలన చేయడం చేతకావడం లేదని వ్యాఖ్యానించారు. వేములవాడలో కోడెల మరణం కొనసాగుతుండగా ప్రభుత్వం స్తంభించినట్లే ఉంది అని వ్యాఖ
హరీష్ రావు


హైదరాబాద్, 4 జూన్ (హి.స.)

వేములవాడలో కోడెల మృతి సంఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాలన చేయడం చేతకావడం లేదని వ్యాఖ్యానించారు. వేములవాడలో కోడెల మరణం కొనసాగుతుండగా ప్రభుత్వం స్తంభించినట్లే ఉంది అని వ్యాఖ్యలు చేశారు.

అనేక కోడెలు గడ్డి లేక చనిపోతున్నా, ప్రభుత్వం పట్టింపు తీసుకోవడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. “మాకు బాధ్యత అప్పగిస్తే కోడెలను కాపాడుతాం” అని స్పష్టత ఇచ్చారు. ఈ మధ్యే మాపై కేసులు పెట్టడం, కమిషన్లు ఏర్పాటు చేయడం తప్ప అసలు సమస్యలపై ప్రభుత్వాన్ని పట్టించుకోడం లేదని, నిజమైన ప్రజా సమస్యలను వదిలి మిగతా విషయాల్లో బిజీ అయ్యారని తెలిపారు. ఇక రేపటి కేబినెట్ సమావేశంలో రైతు బంధు డబ్బులను వెంటనే విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande