
నెల్లూరు, జూన్ 5 (హిం.స)
x, :క్వార్జ్ అక్రమాల కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి నెల్లూరు జిల్లా కోర్టు మరోసారి షాకిచ్చింది. కాకాణి బెయిల్ పిటిషన్‌పై ఈరోజు (గురువారం) కోర్టులో వాదనలు జరిగాయి. ఈ బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. అంతేకాకుండా కాకాణిని కస్టడీకి తీసుకునేందుకు పోలీసులు పిటిషన్ వేయగా.. దానిపై కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఇక కాకాణి అక్రమ మైనింగ్ కేసును పోలీసు శాఖ సీరియస్‌గా తీసుకుంది. నెల్లూరు జిల్లాలో కాకాణి ఆధ్వర్యంలో జరిగిన మైనింగ్ అక్రమాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ