స్టేట్ ఆర్కైవ్స్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో విజిలెన్స్ అధికారుల దాడులు
హైదరాబాద్, 5 జూన్ (హి.స.) వందల సంవత్సరాల నాటి భూ దస్త్రాలు కలిగిన తెలంగాణ స్టేట్ ఆర్కైవ్స్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (రాజ్యాభిలేఖ పరిశోధనాలయం) లో విజిలెన్స్ అధికారులు గురువారం దాడులు నిర్వహిస్తున్నారు. తార్నాకలోని ఈ పరిశోధనాలయంలో పనిచేసే సిబ్బంద
విజిలెన్స్


హైదరాబాద్, 5 జూన్ (హి.స.)

వందల సంవత్సరాల నాటి భూ

దస్త్రాలు కలిగిన తెలంగాణ స్టేట్ ఆర్కైవ్స్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (రాజ్యాభిలేఖ పరిశోధనాలయం) లో విజిలెన్స్ అధికారులు గురువారం దాడులు నిర్వహిస్తున్నారు. తార్నాకలోని ఈ పరిశోధనాలయంలో పనిచేసే సిబ్బందిలో కొందరు భూ కబ్జాదారులతో కుమ్మక్కయి విలువైన పత్రాలను దారిమళ్లిస్తున్నారన్న ఆరోపణలతో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఒరిజినల్ పత్రాలను కాజేసీ వాటి స్థానంలో నకిలీ పత్రాలు చేర్చి వాటి పై రాజముద్ర వేసి ఇస్తున్నట్లు తెలిసింది. విలువైన భూములను కబ్జాదారులకు కట్టబెడుతున్నారు. ఈ మేరకు స్పందించిన విజిలెన్స్ అధికారులు దాడులు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande