బక్రీద్ సందర్భంగా ఈద్గా వద్ద బందోబస్తు.. నిజామాబాద్ సీపీ సాయి చైతన్య
తెలంగాణ, నిజామాబాద్. 7 జూన్ (హి.స.) బక్రీద్ పండుగ సందర్భంగా ఈద్గాల వద్ద బందోబస్తు ఏర్పాట్లను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పీ సాయి చైతన్య పర్యవేక్షించారు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని ఈద్గాలు, మసీదు ల వద్ద
నిజామాబాద్ సిపి


తెలంగాణ, నిజామాబాద్. 7 జూన్ (హి.స.)

బక్రీద్ పండుగ సందర్భంగా ఈద్గాల వద్ద బందోబస్తు ఏర్పాట్లను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పీ సాయి చైతన్య పర్యవేక్షించారు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని ఈద్గాలు, మసీదు ల వద్ద ప్రత్యేక పికెట్లతో పాటు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా నిజామాబాదు లోని శాంతి నగర్ ఈద్గా, బోధన్ పట్టణంలోని నర్సి రోడ్డు ఈద్గాలను పోలీస్ కమిషనర్ స్వయంగా పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ సమస్యలు రాకుండా అవసరమైన చోట ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టినట్టు కమిషనర్ చెప్పారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande