
అమరావతి, 7 జూన్ (హి.స.)
, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా నిరుద్యోగ అభ్యర్థులు వివిధ ఉద్యోగ పరీక్షలకు దరఖాస్తు చేసేందుకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్‌సీ) తొలిసారిగా ఆధార్ ధ్రువీకరణ విధానాన్ని అమలు చేస్తోంది. కొత్త ఆన్‌లైన్ దరఖాస్తు పోర్టల్‌ను ఉద్యోగ ఉద్యోగ.పరీక్షలకు అందుబాటులోకి తెచ్చింది. ఆధార్ సంఖ్య ఇవ్వడంతోపాటు అది అభ్యర్థిదేనని రుజువు చేసుకోవడానికి మొబైల్ నంబరుకు వచ్చే ఓటీపీని నమోదు చేసి, సంబంధిత ధ్రువపత్రాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి ఈ ప్రక్రియ పూర్తయితే...ఆ తర్వాత పరీక్షలకు దరఖాస్తు చేసే సమయంలో ఇదంతా చేయాల్సిన అవసరం ఉండదు. ఈ ప్రక్రియ స్వచ్ఛందమే అయినా...అధిక శాతం మంది అభ్యర్థులు ఆధార్ ధ్రువీకరణ చేసుకుంటున్నారు. గత నెల 28న కొత్త ఆన్‌లైన్ పోర్టల్‌ను ప్రారంభించగా...ఇప్పటివరకు సుమారు 3 లక్షల మంది ఆధార్ ధ్రువీకరణ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ