పంటల యజమాన్య సమస్యలకు ప్రత్యక్ష పరిష్కారం రైతు మిత్ర : జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్
తెలంగాణ, 8 జూన్ (హి.స.) రైతుల సంక్షేమానికి కీలకమైన రైతు మిత్ర ఫార్మర్ ఫ్రెండ్ కార్యక్రమాన్ని జగిత్యాల జిల్లాలో మాత్రమే ప్రత్యేకంగా ప్రారంభించబడుతుందని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు వ్యవసాయ శ
జగిత్యాల కలెక్టర్


తెలంగాణ, 8 జూన్ (హి.స.)

రైతుల సంక్షేమానికి కీలకమైన రైతు మిత్ర ఫార్మర్ ఫ్రెండ్ కార్యక్రమాన్ని జగిత్యాల జిల్లాలో మాత్రమే ప్రత్యేకంగా ప్రారంభించబడుతుందని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు వ్యవసాయ శాఖ అధికారులు రైతులతో ప్రత్యక్షంగా సమావేశమై వారి పంటల సమస్యలకు సమగ్ర పరిష్కారం అందించనున్నారు.

రైతు మిత్ర కార్యక్రమంలో భాగంగా ప్రతీ సోమవారం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు వ్యవసాయ డివిజన్ హెడ్ క్వార్టర్స్ సహాయ వ్యవసాయ సంచాలకుల కార్యాలయం జగిత్యాల, ధర్మపురి, మెట్పల్లిలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా రైతులు తమ పంటల నిర్వహణ, మృత్తిక, నీటి వనరుల, చీడపీడల వంటి అంశాలపై నిపుణుల మార్గదర్శకంలో పెంపొందించుకునేందుకు అవకాశం ఉంటుంది.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande