మాగంటి గోపీనాథ్ మృతి చాలా బాధాకరం.. త‌లసాని
హైదరాబాద్, 9 జూన్ (హి.స.) మాగంటి గోపీనాథ్ మృతి చాలా బాధాకరం అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. సోమవారం మాదాపూర్ లోని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే దివంగత మాగంటి గోపీనాథ్ నివాసానికి మాజీ హోంమంత్రి మహమూద్ అలీత
తలసాని


హైదరాబాద్, 9 జూన్ (హి.స.)

మాగంటి గోపీనాథ్ మృతి చాలా బాధాకరం అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. సోమవారం మాదాపూర్ లోని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే దివంగత మాగంటి గోపీనాథ్ నివాసానికి మాజీ హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి వెళ్ళి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం గోపీనాథ్ సతీమణి, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలిపారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని, దైర్యంగా ఉండాలని ధైర్యం చెప్పారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande