ముంబై, 9 జూన్ (హి.స.)
మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేయడం భారతీయ సాంప్రదాయంలో ఉంది. ఇక పెళ్లి సీజన్ వచ్చిందంటే చాలు బంగారం షాపులన్ని వినియోగదారులతో కిటకిటలాడుతుంటాయి. అయితే భారతదేశంలో బంగారం అంటే మహిళలకు ఎంతో ఇష్టం. ధరలు పెరిగినా, తగ్గినా వినియోగదారులకు షాపులన్ని కిటకిటలాడుతుంటాయి. ఇక తాజాగా జూన్9వ తేదీన దేశీయంగా బంగారం ధరలు అతి స్వల్పంగా తగ్గాయి. అంటే తులం బంగారంపై కేవలం పది రూపాయలు మాత్రమే తగ్గింది. ఇటీవల బంగారం ధర ఏకంగా లక్ష రూపాయాలు దాటేసింది. ఆ తర్వాత క్రమ క్రమంగా దిగి వచ్చింది. ఇప్పుడు మళ్లీ లక్ష రూపాయలు దాటేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 97,960 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 89,790 రూపాయల వద్ద కొనసాగుతోంది. మరి దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 97,960 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 89,790 రూపాయల వద్ద కొనసాగుతోంది.
ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 97,960 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 89,790 రూపాయల వద్ద కొనసాగుతోంది.
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి