యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు 14 రోజుల కస్టడీ
హిసార్‌ , 9 జూన్ (హి.స.)పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలపై అరెస్టైన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు కోర్టులో బిగ్ షాక్ తగిలింది. బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన ఆమెకు హర్యానాలోని హిసార్‌లో గల న్యాయస్థానం మరోసారి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి ఇచ్
యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు 14 రోజుల కస్టడీ


హిసార్‌ , 9 జూన్ (హి.స.)పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలపై అరెస్టైన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు కోర్టులో బిగ్ షాక్ తగిలింది. బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన ఆమెకు హర్యానాలోని హిసార్‌లో గల న్యాయస్థానం మరోసారి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి ఇచ్చింది. జ్యోతి మల్హోత్రా కేసు జూన్ 23వ తేదీన తిరిగి విచారణకు రానుంది. అయితే, ఆమెను జ్యుడీషియల్ కస్టడీకి పంపడం ఇది రెండోసారి. కాగా, అంతకు ముందు, మే 26వ తేదీన, 4 రోజుల పోలీసు రిమాండ్ తర్వాత ఆమెను 14 రోజుల కస్టడీకి పంపింది.

అయితే, గత వారం పాకిస్తాన్ మద్దతు గల గూఢచర్య నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్నాడనే ఆరోపణలతో మరో యూట్యూబర్ జస్బీర్ సింగ్‌ను పంజాబ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక, జస్బీర్- జ్యోతితో క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపుతున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థల విచారణలో తేలింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande