ట్రంప్ సంచలన నిర్ణయం.. మాస్కులు ధరించిన నిరసనకారుల్ని అరెస్ట్ చేయాలని ఆదేశం
లాస్ ఏంజిల్‌ల 9 జూన్ (హి.స.) అక్రమవలసలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం మోపింది. అక్రమవలసదారుల్ని ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేస్తున్నారు. అయితే హఠాత్తుగా పెద్ద ఎత్తున ఘర్షణలు చెలరేగాయి. ఇమ్మిగ్రేషన్ అధికారుల తీరును నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు చెలర
ట్రంప్ సంచలన నిర్ణయం.. మాస్కులు ధరించిన నిరసనకారుల్ని అరెస్ట్ చేయాలని ఆదేశం


లాస్ ఏంజిల్‌ల 9 జూన్ (హి.స.) అక్రమవలసలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం మోపింది. అక్రమవలసదారుల్ని ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేస్తున్నారు. అయితే హఠాత్తుగా పెద్ద ఎత్తున ఘర్షణలు చెలరేగాయి. ఇమ్మిగ్రేషన్ అధికారుల తీరును నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. అధికారులపై నిరససనకారులు ఎదురు తిరిగారు. భద్రతా దళాలతో ఘర్షణకు దిగారు. అంతేకాకుండా వాహనాలకు నిప్పుపెట్టారు. దీంతో పెద్ద ఎత్తున వాహనాలు తగలబడ్డాయి. పరిస్థితులు చేదాటడంతో ట్రంప్.. 2 వేల మంది నేషనల్ గార్డ్ దళాలను దింపారు.

గత కొద్ది రోజులుగా లాస్ ఏంజిల్‌లో ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ఐసీఈ) అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. వారం రోజుల్లో 118 మందిని అరెస్టు చేశారు. శుక్రవారం 44 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఘర్షణలు తలెత్తాయి

ఇక నిరసనల్లో ఎక్కువ శాతం మంది ముసుగులు, మాస్కులు ధరించి ఉన్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మాస్కులు ధరించి నిరసనల్లో పాల్గొ్న్నవారిని అరెస్ట్ చేయాలని కీలక ఆదేశాలు ఇచ్చారు. ‘‘ముఖానికి ముసుగులు వేసుకున్న వ్యక్తులను ఇప్పుడే అరెస్టు చేయండి.’’ అని అమెరికా అధ్యక్షుడు తన సోషల్ ట్రూత్ ప్లాట్‌ఫామ్‌లో ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande