అమరావతి, 9 జూన్ (హి.స.) కన్నప్ప మూవీపై మంచు లక్ష్మి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా వస్తున్న కన్నప్పలో మంచు లక్ష్మి ఎందుకు నటించలేదంటూ కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను ఈ మూవీలో నటిస్తే మిగతా ఎవరూ కనిపించరంటూ సెటైర్ వేశారు. ఈ మూవీలో తనకు సరిపోయే పాత్ర లేదని భావిస్తున్నానని, అందుకే విష్ణు తనకు అవకాశం ఇవ్వలేదని అనుకుంటున్నానన్నారు. ఒకవేళ తాను చేయగలిగే పాత్ర ఉంటే విష్ణు అవకాశం ఇచ్చేవాడేమోనని, ఆ విషయం గురించి విష్ణునే అడగాలని చెప్పింది.
కన్నప్ప మూవీలో తాను కూడా నటించి ఉంటే అది ఒక ఫ్యామిలీ మూవీ అని అంతా అనుకునేవారని, ఇప్పటికే తమ ఫ్యామిలీ చాలా మూవీల్లో కలిసి నటించామని లక్ష్మి పేర్కొంది. తనకు నటించే అవకాశం ఇవ్వకపోవడంతో తమ్ముడు విష్ణుకు తన మద్దతు లేదని అనుకుంటున్నారని, అది నిజం కాదని చెప్పుకొచ్చింది. సినిమాలో అవకాశం ఇవ్వలేకపోయినంత మాత్రాన తమ మధ్య ఏదో ఉందని అనుకోవద్దని చెప్పింది. తన మద్దతు ఎప్పుడూ విష్ణుకు ఉంటుందని పేర్కొంది.
.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి