భారీగా తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర.. ఎంతంటే?
ముంబై, 1 జూలై (హి.స.)గుడ్‌న్యూస్.. జూలై నెల శుభవార్తతో ప్రారంభమైంది. ఈ ఉదయం చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) LPG సిలిండర్ల ధరలను తగ్గించడం ద్వారా సామాన్యులకు ఉపశమనం కలిగించాయి. ప్రతి నెల మొదటి తేదీన చమురు మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ల ధరలను
భారీగా తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర.. ఎంతంటే?


ముంబై, 1 జూలై (హి.స.)గుడ్‌న్యూస్.. జూలై నెల శుభవార్తతో ప్రారంభమైంది. ఈ ఉదయం చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) LPG సిలిండర్ల ధరలను తగ్గించడం ద్వారా సామాన్యులకు ఉపశమనం కలిగించాయి. ప్రతి నెల మొదటి తేదీన చమురు మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ల ధరలను సవరిస్తాయి. ఈ నెల సిలిండర్ రేటును తగ్గించాలని నిర్ణయించారు. దేశ వ్యాప్తంగా కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరలను తగ్గించినట్లు ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ప్రకటించాయి. 19కేజీల సిలిండర్‌ ధరను రూ.58.50 మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో ఢిల్లీలో సిలిండర్‌ రేటు రూ.1,665కు చేరింది. తగ్గించిన ధరలు ఇవాళ్టి(జులై1) నుంచి అమల్లోకి వచ్చాయి. అటు గృహ అవసరాలకు ఉపయోగించే డొమెస్టిక్‌ సిలిండర్‌ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇకపోతే, మారిన గ్యాస్‌ ధరలు స్థానిక పన్నుల ఆధారంగా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రేటు ఉంటుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande