ఢిల్లీ, 1 జూలై (హి.స.) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన 'బిగ్ బ్యూటిఫుల్ బిల్లు ను ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఆ బిల్లుపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఈ బిల్లు ప్రజల హక్కులను హరించేలా ఉందంటూ విరుచుకుపడ్డారు. బిల్లును ఆమోదిస్తే.. వెంటనే కొత్త పార్టీ ఏర్పాటుచేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
బిగ్ బ్యూటిఫుల్ బిల్లుపై మస్క్ మొదటి నుంచి వ్యతిరేకంగా ఉన్నారు. ఈ బిల్లు ఆమోదం పొందితే, దేశ ప్రజల భవిష్యత్తు ముప్పులో పడుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్, టెస్లా అధినేతకు మధ్య విభేదాలు కూడా తలెత్తాయి.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..