దిల్లీ;1 జూలై (హి.స.), హైదరాబాద్: ఎక్స్‌ప్రెస్ రైళ్ల ఏసీ తరగతుల్లో కిలోమీటరుకు రెండు పైసలు, నాన్ ఏసీలో కిలోమీటరుకు ఒక పైసా చొప్పున ఛార్జీల పెంపు మంగళవారం నుంచి అమల్లోకి రానుందని రైల్వేశాఖ ప్రకటించింది. నూతన ఛార్జీల పట్టికను సోమవారం విడుదల చేసింది. 2020లో ఛార్జీల సవరణ తర్వాత దాదాపు ఐదేళ్లకు మళ్లీ ఛార్జీలు పెరిగాయి. ఇప్పటికే రిజర్వేషన్ చేసిన టికెట్లకు పెంచిన ఛార్జీలు వర్తించవని, జులై 1 నుంచి కొత్త రైల్వే ఛార్జీలు, టికెట్ బుకింగ్‌లు అమల్లోకి వస్తాయని పేర్కొంది. రిజర్వేషన్ ఛార్జ్, సూపర్‌ఫాస్ట్ సర్‌ఛార్జీల్లో మార్పు ఉండదని స్పష్టం చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ