ప్రయాణికులకు సూపర్ గుడ్ న్యూస్.. రైల్ వన్ యాప్ వచ్చేసింది
ఢిల్లీ, 1 జూలై (హి.స.)ఇండియన్ రైల్వే (Indian Railway) ప్రయాణికులకు శుభవార్త తెలిపింది. ప్రయాణంలో అవసరమయ్యే అన్ని రకాల సేవలను ఒకే చోట అందించేందుకు కొత్త సూపర్ యాప్‌ ''రైల్‌వన్‌ (Rail One)''ను కేంద్ర రైల్వే శాఖ ఆవిష్కరించింది. ఇప్పటివరకు రిజర్వేషన్
ప్రయాణికులకు సూపర్ గుడ్ న్యూస్.. రైల్ వన్ యాప్ వచ్చేసింది


ఢిల్లీ, 1 జూలై (హి.స.)ఇండియన్ రైల్వే (Indian Railway) ప్రయాణికులకు శుభవార్త తెలిపింది. ప్రయాణంలో అవసరమయ్యే అన్ని రకాల సేవలను ఒకే చోట అందించేందుకు కొత్త సూపర్ యాప్‌ 'రైల్‌వన్‌ (Rail One)'ను కేంద్ర రైల్వే శాఖ ఆవిష్కరించింది. ఇప్పటివరకు రిజర్వేషన్ టికెట్ల కోసం IRCTC యాప్, అన్‌రిజర్వ్‌డ్‌ టికెట్ల కోసం UTS యాప్, ఫుడ్ ఆర్డర్, ఫిర్యాదులు, ట్రైన్ స్టేటస్ కోసం వేరే వేరే యాప్‌లు వినియోగించాల్సి వచ్చేది. ఇప్పుడు వాటన్నింటినీ ఒకే యాప్‌లో పొందేలా రైల్ వన్ యప్‌ను రూపొందించారు. దీన్ని కొన్ని నెలలుగా స్వరైల్ పేరిట పరీక్షించిన రైల్వేశాఖ.. ఎట్టకేలకు యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. అలాగే, ఇందులో మున్ముందు మరిన్ని సేవలను జోడించే అవకాశం ఉంది. ఈ యాప్‌ను అభివృద్ధి చేసిన సెంటర్‌ ఫర్‌ రైల్వే ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ (CRIS) వార్షికోత్సవం సందర్భంగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ లాంచ్‌ చేశారు.

ఈ యాప్ ద్వారా ప్రయాణికులు రిజర్వ్‌, అన్‌రిజర్వ్‌డ్‌, ప్లాట్‌ఫామ్‌ టికెట్లు బుక్‌ చేయడం, పీఎన్ఆర్ స్టేటస్, ట్రైన్ లైవ్ స్టేటస్, కోచ్ పొజిషన్ తెలుసుకోవడం, ఫుడ్ ఆర్డర్, ఫిర్యాదులు, ఫీడ్‌బ్యాక్, రైల్వే వాలెట్ (R-Wallet) వాడటం వంటి సేవలను పొందొచ్చు. ముఖ్యంగా సింగిల్ సైన్-ఇన్ సౌకర్యం ద్వారా ఒక్కసారి లాగిన్ అయితే అన్ని సేవలకు మళ్లీ మళ్లీ పాస్‌వర్డ్ అవసరం ఉండదు. RailConnect లేదా UTS అకౌంట్లు ఉన్నవారు అదే లాగిన్‌ వివరాలతో యాప్‌ ఉపయోగించవచ్చు. ఇక ఇది గూగుల్ ప్లే స్టోర్‌, యాపిల్ యాప్ స్టోర్‌ ద్వారా అందుబాటులో ఉంది. ఈ యాప్‌తో పాటు రైల్వే శాఖ మరికొన్ని కీలక మార్పులను కూడా ప్రకటించింది. తత్కాల్ బుకింగ్‌ కోసం జూలై 1, 2025 నుంచి ఒన్‌లీ వెరిఫైడ్ యూజర్లే అర్హులు. అలాగే వెయిట్‌లిస్ట్ చార్ట్‌ను ఇకపై 8 గంటల ముందే సిద్ధం చేయనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande