తగ్గుతున్న బంగారం ధరలు.. ఇంకా పెరుగుతాయా? తగ్గుతాయా? తులం ధర ఎంత?
hముంబై, 10 జూలై (హి.స.)బంగారం ధరలు పతనమవుతున్నాయి. ఒక రోజు తగ్గితే మరో పెరుగుతున్న పసిడి.. గురువారం స్వల్పంగా తగ్గింది. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) వెబ్‌సైట్ ప్రకారం.. గురువారం ఉదయం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.98,170 ఉం
Gold


hముంబై, 10 జూలై (హి.స.)బంగారం ధరలు పతనమవుతున్నాయి. ఒక రోజు తగ్గితే మరో పెరుగుతున్న పసిడి.. గురువారం స్వల్పంగా తగ్గింది. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) వెబ్‌సైట్ ప్రకారం.. గురువారం ఉదయం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.98,170 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.89,990 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి కూడా స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం కిలో ధర రూ.1,09,900 వద్ద ఉంది.

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 98,170 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.89,990 వద్ద ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 98,320 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.90,140 వద్ద ఉంది.

ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 98,170 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.89,990 వద్ద ఉంది.

బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 98,170 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.89,990 వద్ద ఉంది.

బంగారం ధర డాలర్లలో వర్తకం చేస్తారు. అందుకే డాలర్ పెరుగుదల సాధారణంగా ఇతర కరెన్సీలతో కొనుగోలుదారులకు బంగారం ఖరీదైనదిగా మారుతుంది. ఇది డిమాండ్ విలువైన లోహం ధర తగ్గడానికి దారితీస్తుంది

ప్రస్తుతం బంగారం ధరలు పడిపోతున్నా.. మళ్లీ పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం తగ్గుతున్న బంగారం ధరలు స్వల్పకాలికమేనని అంటున్నారు. భారత మార్కెట్ లో బంగారం ధరలు రాబోయే రోజుల్లో 99 వేల నుంచి లక్ష రూపాయల మధ్య స్థిరపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరికొంత మంది నిపుణులు 95 నుంచి ఒక లక్ష రూపాయల మధ్యగా బంగారం ధరలు స్థిరపడవచ్చని పేర్కొంటున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande