మగువలకు బిగ్ షాక్.. నేడు మళ్లీ పెరిగిన బంగారం ధర!
ముంబై, 9 జూలై (హి.స.)మగువలకు బిగ్ షాక్..మళ్లీ పెరిగిన బంగారం ధర! మగువలకు బిగ్ షాక్ తగిలింది. తగ్గుతూ వస్తుంది అనుకున్న బంగారం ధర మరోసారి పెరుగుతూ బంగారం ప్రియులను నిరాశకు గురి చేసింది. మన దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ దేనీకి లేదు. చాలా మంది ఎక్కువగా
మగువలకు బిగ్ షాక్.. నేడు మళ్లీ పెరిగిన బంగారం ధర!


ముంబై, 9 జూలై (హి.స.)మగువలకు బిగ్ షాక్..మళ్లీ పెరిగిన బంగారం ధర! మగువలకు బిగ్ షాక్ తగిలింది. తగ్గుతూ వస్తుంది అనుకున్న బంగారం ధర మరోసారి పెరుగుతూ బంగారం ప్రియులను నిరాశకు గురి చేసింది. మన దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ దేనీకి లేదు. చాలా మంది ఎక్కువగా కొనడానికి ఇష్టపడే దాంట్లో బంగారమే ముందుంటుంది. ఇక త్వరలో శ్రావణ మాసం కూడా ప్రారంభం అవుతుండటంతో చాలా మంది శుభకార్యాలు చేస్తుంటారు. దీంతో ఇప్పుడే గోల్డ్ కొనుగోలు చేయాలని భావిస్తుంటారు. ఇలాంటి సమయంలో బంగారం ధర పెరగడం వారికి నిరాశకు గురి చేస్తుంది.

ప్రస్తుతం గోల్డ్ రేట్స్ అనేవి ఆకాశాన్నంటుతున్నాయి. రోజు రోజుకు ధరలు పెరుగుతూ సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటికే గోల్డ్ రేట్స్ లక్షమార్క్ దాటిన విషయం తెలిసిందే. కాగా, నేడు బుధ వారం అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. జూలై 9, 2025న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.98,850 గా ఉండగా,22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.90,610గా ఉంది.

జూలై 9, 2025 మంగళ వారం (నిన్న)24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.98,840గా ఉండగా,నేడు రూ.10 పెరగడంతో గోల్డ్ రేట్ రూ.98,850గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్న రూ.90,600గా ఉండగా, నేడు రూ.10 పెరగడంతో గోల్డ్ రేట్ రూ.90,610గా ఉంది.

ప్రముఖ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే.. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.98,850 ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.90,610 లుగా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.1,19,800లుగా ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande