తెలంగాణ, జోగులాంబ గద్వాల. 11 జూలై (హి.స.)
జోగులాంబ గద్వాల్ జిల్లా గట్టు మండలంలోని నందిన్నె చెక్పోస్ట్ వద్ద గురువారం అర్థరాత్రి అధికారులు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న నల్లబెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లానుండి నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్కు అక్రమంగా తీసుకువస్తున్న అశోక్ లేలాండ్ వాహనాన్ని నందిన్నె చెకోపోస్ట్ వద్ద గద్వాల్ ఎహెచ్ టీం, చెకోపోస్ట్ సిబ్బంది అడ్డగించారు. వాహనాన్ని పరిశీలించగా 60 బస్తాల నల్లబెల్లం (ప్రతి బస్తా 30 కిలోలు.. మొత్తం 1800 కిలోలు) ఉండటం గుర్తించారు. అక్రమ రవాణా నేపథ్యంలో వాహనాన్ని సీజ్ చేసిన అధికారులు, ముక్కిడిగుండం గ్రామానికి చెందిన బాగత్ సింగ్, వాహన డ్రైవర్పై కేసు నమోదు చేశారు. ఈ వివరాలను గద్వాల్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు శుక్రవారం వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు