లండన్, 14 జూలై (హి.స.)
అనారోగ్య కారణాలతో నైజీరియా మాజీ అధ్యక్షుడు ముహమ్మద్ బుహారీ నిన్న(13 జూలై) మృతి చెందారు. లండన్లోని ఒక క్లినిక్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు అధికారులు ప్రకటించారు. ఆయన మృతిపై భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగా స్పందిస్తూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాని తన ట్వీట్లో నైజీరియా మాజీ అధ్యక్షుడు ముహమ్మద్ బుహారీ మరణం నాకు తీవ్ర బాధను కలిగించింది. వివిధ సందర్భాలలో మా సమావేశాలు, సంభాషణలను నేను ప్రేమగా గుర్తుచేసుకుంటున్నాను. భారతదేశం-నైజీరియా స్నేహం పట్ల ఆయన జ్ఞానం, ఆప్యాయత, అచంచలమైన నిబద్దత ప్రత్యేకంగా నిలిచాయి. ఆయన కుటుంబానికి, ప్రజలకు, నైజీరియా ప్రభుత్వానికి మా హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేయడంలో 1.4 బిలియన్ల భారతదేశంలోని ప్రజలతో నేను కూడా చేరాను. అని మోడీ రాసుకొచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..