.పుదుచ్చేరి.కిచెందిన ప్రపంచ సుందరి శాన్ రేచల్ ఆత్మహత్యకు..పాల్పడ్డారు
అమరావతి, 14 జూలై (హి.స.) ఆర్కేనగర్, పుదుచ్చేరికి చెందిన ప్రపంచ సుందరి శాన్‌ రేచల్‌ అధిక మోతాదులో మాత్రలు వేసుకొని ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసుల కథనం మేరకు... పుదుచ్చేరి కారామణికుప్పంకు చెందిన శంకరప్రియ అలియాస్‌ శాన్‌ రేచల్‌ (25) చిన్నతనంల
.పుదుచ్చేరి.కిచెందిన ప్రపంచ సుందరి శాన్ రేచల్ ఆత్మహత్యకు..పాల్పడ్డారు


అమరావతి, 14 జూలై (హి.స.)

ఆర్కేనగర్, పుదుచ్చేరికి చెందిన ప్రపంచ సుందరి శాన్‌ రేచల్‌ అధిక మోతాదులో మాత్రలు వేసుకొని ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసుల కథనం మేరకు... పుదుచ్చేరి కారామణికుప్పంకు చెందిన శంకరప్రియ అలియాస్‌ శాన్‌ రేచల్‌ (25) చిన్నతనంలోనే క్యాన్సర్‌ కారణంగా తల్లిని కోల్పోయింది. నల్లగా ఉండటంతో చాలామంది ఆమెను దూరం పెట్టారు. చర్మం రంగుతో సంబంధం లేకుండా తన ప్రతిభతో మోడలింగ్‌ రంగంలో రాణించారు. 2020-21లో మిస్‌ పాండిచ్చేరి, 2019లో మిస్‌ డార్క్‌ క్వీన్‌ తమిళనాడు, అదే ఏడాదిలో మిస్‌ బెస్ట్‌ యాటిట్యూడ్‌ తదితర పలు టైటిల్స్‌ని గెలుపొందారు.

బ్లాక్‌ బ్యూటీ విభాగంలో మిస్‌ వరల్డ్‌ టైటిల్‌ని కూడా గెలుచుకున్నారు. గత కొన్నిరోజులుగా కిడ్నీ సమస్యతో జిప్మర్‌లో చికిత్స పొందుతున్న ఆమె ఆదివారం తన నివాసంలో అధిక మోతాదులో రక్తపోటు మాత్రలు తీసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఫ్యాషన్‌ షో సహా పలు కార్యక్రమాలు నిర్వహించడం వల్ల కలిగిన నష్టాల కారణంగా ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. పుదుచ్చేరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande