నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబై, 14 జూలై (హి.స.) దేశీయ స్టాక్‌ మార్కెట్లు (Stock Market) ఇవాళ‌ ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. ఈ తర్వాత కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ఇక ఏ దశలోనూ మార్కెట్లు కోలుకోలేదు. చివరగా స్వల్పంగా కోలుకోవడంతో నష్టాలు స్వల్పంగా తగ్గాయి. క్రితం సె
స్టాక్ మార్కెట్


ముంబై, 14 జూలై (హి.స.)

దేశీయ స్టాక్‌ మార్కెట్లు (Stock Market) ఇవాళ‌ ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. ఈ తర్వాత కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ఇక ఏ దశలోనూ మార్కెట్లు కోలుకోలేదు. చివరగా స్వల్పంగా కోలుకోవడంతో నష్టాలు స్వల్పంగా తగ్గాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ (Sensex) 82,537.87 పాయింట్ల వద్ద నష్టాల్లో మొదలైంది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ ఒక దశలో 82,010.38 పాయింట్లకు పడిపోయింది. చివరకు 247.01 పాయింట్లు పతనమై.. 82,253.46 వద్ద ముగిసింది. నిఫ్టీ (Nifty) సైతం 67.55 పాయింట్లు తగ్గి 25,082.30 వద్ద స్థిరపడింది.ట్రేడింగ్‌లో 1,991 షేర్లు లాభపడగా.. 2,020 షేర్లు పతనమయ్యాయి. జియో ఫైనాన్షియల్, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, విప్రో, ఏషియన్ పెయింట్స్ నష్టపోయాయి. ఎటర్నల్, టైటాన్ కంపెనీ, ఇండస్ఇండ్ బ్యాంక్, ఓఎన్‌జీసీ, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ లాభపడ్డాయి. రంగాల వారీగా చూస్తే ఐటీ ఇండెక్స్ ఒకశాతం తగ్గింది. ఫార్మా, కన్స్యూమర్ డ్యూరబుల్స్, మీడియా, రియాలిటీ, పీఎస్‌యూ బ్యాంక్‌ 0.5-1 శాతం పెరిగాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 0.5 శాతం పెరిగాయి. ఇక డాలర్‌ మారకంతో పోలిస్తే రూపాయి 19 పైసలు తగ్గి 85.99 వద్ద ముగిసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande