న్యాయవాద వృత్తికి స్వస్తి పలికిన దుష్యంత్‌ దవే
దిల్లీ: , 14 జూలై (హి.స.)సుప్రీకోర్టు బార్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు, సీనియర్‌ అడ్వొకేట్‌ దుష్యంత్‌ దవే 4 దశాబ్దాల తన న్యాయవాద వృత్తికి స్వస్తి పలకాలని నిర్ణయించుకున్నారు. ‘న్యాయవాద వృత్తిలో 48 ఏళ్లు పూర్తి చేసుకున్నాను. 70వ జన్మదినాన్ని జరుపుకొన్
న్యాయవాద వృత్తికి స్వస్తి పలికిన దుష్యంత్‌ దవే


దిల్లీ: , 14 జూలై (హి.స.)సుప్రీకోర్టు బార్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు, సీనియర్‌ అడ్వొకేట్‌ దుష్యంత్‌ దవే 4 దశాబ్దాల తన న్యాయవాద వృత్తికి స్వస్తి పలకాలని నిర్ణయించుకున్నారు. ‘న్యాయవాద వృత్తిలో 48 ఏళ్లు పూర్తి చేసుకున్నాను. 70వ జన్మదినాన్ని జరుపుకొన్నాను. ఇక ఈ వృత్తిని వదిలేద్దామని అనుకుంటున్నాను’ అని దవే వాట్సప్‌ సందేశం ద్వారా తెలియజేశారు. ఆయన 1954 అక్టోబరు 27న జన్మించారు. 1978లో గుజరాత్‌లో న్యాయవాద వృత్తిని ఆరంభించారు. అనంతరం దిల్లీకి వచ్చి సుప్రీంకోర్టులో ప్రాక్టీస్‌ చేశారు. దవే తండ్రి జస్టిస్‌ అర్వింద్‌ దవే గుజరాత్‌ హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలందించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande