పసిడి ప్రియులకు అలర్ట్.. మళ్లీ లక్ష రూపాయల చేరువలోకి బంగారం..
ముంబై, 14 జూలై (హి.స.) గత రెండు వారాల్లో 98 వేలకు సమీపంలో ఉన్న బంగారం (gold), వెండి (silver) ధరలు ప్రస్తుతం తిరిగి లక్ష రూపాయలు చేరువ అవుతున్నాయి. పది గ్రాముల బంగారం ధర మళ్లీ లక్ష రూపాయలను దాటి ట్రేడ్ అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యం
GOLD


ముంబై, 14 జూలై (హి.స.)

గత రెండు వారాల్లో 98 వేలకు సమీపంలో ఉన్న బంగారం (gold), వెండి (silver) ధరలు ప్రస్తుతం తిరిగి లక్ష రూపాయలు చేరువ అవుతున్నాయి. పది గ్రాముల బంగారం ధర మళ్లీ లక్ష రూపాయలను దాటి ట్రేడ్ అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు (జులై 14న) ఉదయం 6.30 గంటల సమయానికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. 99, 700కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ. 91, 390కి చేరింది.

ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ. 99, 850కి చేరుకోగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 91, 540కి చేరుకుంది. ఇక హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 99, 700కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 91, 390కి చేరింది. వెండి ధరలు నిన్నటితో పోల్చుకుంటే వంద మేర తగ్గాయి. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి రేట్లను ఇప్పుడు తెలుసుకుందాం.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)

హైదరాబాద్‌లో రూ. 99, 700, రూ. 91, 540

విజయవాడలో రూ. 99, 700, రూ. 91, 540

ఢిల్లీలో రూ. 99, 850, రూ. 91, 540

ముంబైలో రూ. 99, 700, రూ. 91, 540

వడోదరలో రూ. 99, 750, రూ. 91, 440

కోల్‌కతాలో రూ. 99, 700, రూ. 91, 540

చెన్నైలో రూ. 99, 700, రూ. 91, 540

బెంగళూరులో రూ. 99, 700, రూ. 91, 540

కేరళలో రూ. 99, 700, రూ. 91, 540

పుణెలో రూ. 99, 700, రూ. 91, 540

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande