దిల్లీ:, 14 జూలై (హి.స.)భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ (S Jaishankar) సోమవారం చైనా పర్యటనకు వెళ్లారు. బీజింగ్‌లో చైనా ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్ (Han Zheng)తో సమావేశమై.. ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలపై చర్చించారు. షాంఘై సహకార సంస్థ (SCO) అధ్యక్ష పదవికి చైనాకు భారత మద్దతును ఆయన తెలియజేశారు. మీడియాతో మాట్లాడుతూ.. బీజింగ్ ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్‌ను కలవడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ చర్చలు సానుకూల ఫలితాలను ఇస్తాయని విశ్వాసం వ్యక్తంచేశారు. కైలాస మానససరోవర్ యాత్రను పునఃప్రారంభించినందుకు భారత ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఐదేళ్ల అనంతరం అటానమస్ రీజియన్ షిజాంగ్ (టిబెట్)లో ఉన్న మాపవ్ యున్ సో (మానససరోవర్ సరస్సు)కు భారత యాత్రికులు చేరుకోవడంపై సంతోషం వ్యక్తంచేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ