మోదీపై పంజాబ్‌ మంత్రి సంచలన ఆరోపణలు-లక్షిత హత్యల కోసమే లారెన్స్‌ను వాడుకున్నారు..
దిల్లీ:, 14 జూలై (హి.స.)పంజాబ్‌ ఆర్థిక మంత్రి హర్‌పాల్‌ చీమా ప్రధాని మోదీపై సంచలన ఆరోపణలు చేశారు. లక్షిత హత్యలు చేయించేందుకు గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయిని మోదీ వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. లారెన్స్‌ ద్వారా భాజపా బెదిరింపులకు దిగుతోందన్నారు.
మోదీపై పంజాబ్‌ మంత్రి సంచలన ఆరోపణలు-లక్షిత హత్యల కోసమే లారెన్స్‌ను వాడుకున్నారు..


దిల్లీ:, 14 జూలై (హి.స.)పంజాబ్‌ ఆర్థిక మంత్రి హర్‌పాల్‌ చీమా ప్రధాని మోదీపై సంచలన ఆరోపణలు చేశారు. లక్షిత హత్యలు చేయించేందుకు గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయిని మోదీ వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. లారెన్స్‌ ద్వారా భాజపా బెదిరింపులకు దిగుతోందన్నారు. ప్రస్తుతం లారెన్స్‌ బిష్ణోయి ప్రధాని, కేంద్ర హోం మంత్రుల ఇలాకాలోని జైలులోనే ఉన్నాడని హర్‌పాల్‌ చీమా పేర్కొన్నారు. పంజాబ్‌లో డ్రగ్స్‌ స్మగ్లర్లకు రక్షణ కల్పించేందుకు భాజపా, కాంగ్రెస్‌ కలిసి పనిచేస్తున్నాయని హర్‌పాల్‌ చీమా పేర్కొన్నారు. ఆప్‌ నేతలు తాను మాట్లాడిన ఓ వీడియోను ఎడిట్‌ చేయించి, తప్పుడు అర్థం వచ్చేలా సోషల్‌ మీడియాలో వైరల్‌ చేయించారంటూ చండీగఢ్‌లోని సెక్టార్‌-3 పోలీసు స్టేషన్‌లో కాంగ్రెస్‌ నేత ప్రతాప్‌ సింగ్‌ బజ్వా ఫిర్యాదు చేశారు. ఈ అభియోగాల ఆధారంగా శుక్రవారం పంజాబ్‌లోని ఆప్‌ మంత్రులు హర్‌పాల్‌ సింగ్‌ చీమా, అమన్‌ అరోరాపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. దీనిపై స్పందిస్తూ హర్‌పాల్‌ చీమా పైవ్యాఖ్యలు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande