వచ్చే నెలలో చైనాలో పర్యటించనున్న ప్రధాని మోదీ
న్యూఢిల్లీ, 16 జూలై (హి.స.) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెలలో చైనాలో పర్యటించనున్నారు. చైనాలోని తియాంజిన్ వేదికగా షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు ప్రధాని మోదీ హాజరుకానున్నారనీ అధికారవర్గాల సమాచారం. ఇందుకోసం ఆగస్టు లే
ప్రధాని మోదీ


న్యూఢిల్లీ, 16 జూలై (హి.స.)

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెలలో చైనాలో పర్యటించనున్నారు. చైనాలోని తియాంజిన్ వేదికగా షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు ప్రధాని మోదీ హాజరుకానున్నారనీ అధికారవర్గాల సమాచారం. ఇందుకోసం ఆగస్టు లేదా సెప్టెంబర్ లో మోదీ చైనాకు వెళతారని తెలిపాయి. లడఖ్ సరిహద్దుల్లో చైనా – భారత సైనికుల మధ్య ఘర్షణ తర్వాత తొలిసారి ప్రధాని మోదీ చైనాలో పర్యటించనున్నారని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. తియాంజిన్ సిటీలో ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 1 తేదీ వరకు ఎస్ సీవో సమిట్ జరగనుంది. ఈ సమావేశంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత్ తరఫున ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తదితరులు పాల్గొంటారు. ఈ సదస్సు సందర్భంగా జిన్ పింగ్ తో ప్రధాని మోదీ చర్చలు జరపనున్నట్లు సమాచారం.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande