హర్యానాలో భూకంపం
ఢిల్లీ, 17 జూలై (హి.స.)హర్యానా (Haryana) రాష్ట్రంలో భూకంపం (Earthquake) సంభవించింది. గురువారం ఉదయం పలు ప్రాంతాల్లో భూప్రకంపానాలు చోటుచేసుకున్నాయి. రికార్డు స్కేలుపై దీని తీవ్రత 3.3గా నమోదైనట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ వెల్లడించింది. భూకంపంతో భ
హర్యానాలో భూకంపం


ఢిల్లీ, 17 జూలై (హి.స.)హర్యానా (Haryana) రాష్ట్రంలో భూకంపం (Earthquake) సంభవించింది. గురువారం ఉదయం పలు ప్రాంతాల్లో భూప్రకంపానాలు చోటుచేసుకున్నాయి. రికార్డు స్కేలుపై దీని తీవ్రత 3.3గా నమోదైనట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ వెల్లడించింది. భూకంపంతో భయందోళనలకు గురైన ప్రజలు రోడ్లపైకి పరుగులు తీశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదు. ఆస్తి నష్టంపై సమాచారం తెలియాల్సి ఉంది. కాగా, ఓ వైపు భారీ వర్షాలను బీభత్సం సృష్టిస్తుంటే.. మరోవైపు భూకంపం సంభవించటంతో ప్రజలు తీవ్ర భయందోళనలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని అధికారులు సూచనలు జారీ చేశారు. కాగా, ఇటీవల దేశరాజధాని ఢిల్లీలో సైతం వరుస భూకంపాలు సంభవించిన సంగతి తెలిసిందే.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande