హైదరాబాద్, 17 జూలై (హి.స.)
ఇకపై అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో భగవద్గీత పారాయణం తప్పనిసరి అని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం భగవద్గీత శ్లోకాలను పారాయణం చేయాలని విద్యార్థులను ఆదేశించారు. ప్రతిరోజూ ఒక శ్లోకం పారాయణం చేయడమే కాకుండా ఒక శ్లోకాన్ని వారపు శ్లోకంగా ప్రకటించి దాని అర్థాన్ని నోటీసు బోర్డులో రాయాలని ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది.శ్రీమద్ భగవద్గీత సూత్రాలు మానవ విలువలు, ప్రవర్తన, నాయకత్వ నైపుణ్యాలు, నిర్ణయం తీసుకునే సామర్థ్యం, భావోద్వేగ సమతుల్యత, శాస్త్రీయ ఆలోచనలను ఎలా అభివృద్ధి చేస్తాయో ఉపాధ్యాయులు విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు. జాతీయ విద్యా విధానం 2020 కింద భారతీయ సంప్రదాయం, జ్ఞాన వ్యవస్థ ఆధారంగా విద్యార్థులకు వివిధ విషయాలను బోధిస్తామని విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ ముకుల్ కుమార్ సతి తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్