పహల్గాం ఉగ్రదాడిని ఖండించిన క్వాడ్‌
క్వాడ్, 2 జూలై (హి.స.) జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఇటీవల పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని క్వాడ్‌ నేతలు తీవ్రంగా ఖండించారు. అమెరికాలో క్వాడ్ విదేశాంగశాఖ మంత్రుల సమావేశం జరిగింది. ఈసందర్భంగా ఉగ్రదాడికి పాల్పడిన నేరస్థులకు, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారి
పహల్గాం ఉగ్రదాడిని ఖండించిన క్వాడ్‌


క్వాడ్, 2 జూలై (హి.స.)

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఇటీవల పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని క్వాడ్‌ నేతలు తీవ్రంగా ఖండించారు. అమెరికాలో క్వాడ్ విదేశాంగశాఖ మంత్రుల సమావేశం జరిగింది. ఈసందర్భంగా ఉగ్రదాడికి పాల్పడిన నేరస్థులకు, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారికి త్వరగా శిక్ష పడాలని సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.

‘ఉగ్రవాదంతో సహా హింసాత్మక తీవ్రవాద చర్యలను క్వాడ్‌ ఖండిస్తుంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తీసుకునే చర్యలకు మా సహకారం ఉంటుంది. ఏప్రిల్‌ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దాడిపై త్వరగా దర్యాప్తు పూర్తి చేసి నేరస్థులను, వారిని ప్రోత్సహించేవారని ఆలస్యం లేకుండా శిక్షించాలి’ అని పేర్కొన్నారు. ఈసందర్భంగా ఉగ్ర దాడిలో మృతి చెందిన కుటుం

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande