ఎయిర్ ఇండియా ప్రమాద ఫైన‌ల్ రిపోర్టు కోసం వెయిటింగ్ – కేంద్ర మంత్రి రామ్మోహ‌న్‌ నాయుడు
న్యూఢిల్లీ, 21 జూలై (హి.స.) అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమానం ప్రమాదంపై దర్యాప్తు అంతర్జాతీయ ప్రోటోకాల్‌లకు అనుగుణంగా జరుగుతోందని కేంద్ర పౌర‌విమాన‌యాన శాఖ మంత్రి రామ్మోహ‌న్ నాయుడు తెలిపారు. ఈ దర్యాప్తును ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగే
రామ్మోహ‌న్‌ నాయుడు


న్యూఢిల్లీ, 21 జూలై (హి.స.)

అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమానం ప్రమాదంపై దర్యాప్తు అంతర్జాతీయ ప్రోటోకాల్‌లకు అనుగుణంగా జరుగుతోందని కేంద్ర పౌర‌విమాన‌యాన శాఖ మంత్రి రామ్మోహ‌న్ నాయుడు తెలిపారు. ఈ దర్యాప్తును ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బోర్డ్ నిర్వహిస్తోందన్నారు. ప్రమాదం ఎలా, ఎందుకు జరిగిందనే దానిపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని, తుది నివేదికలో పూర్తి వివరాలు వెల్లడవుతాయని మంత్రి అన్నారు. సోమ‌వారం ప్రారంభ‌మైన వ‌ర్షాకాల లోక్‌సభ స‌మావేశఃలో లో ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయగా, పౌర విమానయాన శాఖ మంత్రి స్పందించారు.అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మొదటి దశ దర్యాప్తు ఇప్పటికే పూర్తయింద‌న్నారు . ఈ దశలో ప్రాథమిక నివేదికను ఇప్ప‌టికే ద‌ర్యాప్తు సంస్థ విడుదల చేసిన విష‌యాన్ని గుర్తు చేశారు. . విమానంలోని బ్లాక్ బాక్స్‌కు కొంత నష్టం జరిగింద‌ని, సాధారణంగా, బ్లాక్ బాక్స్‌కు నష్టం జరిగినప్పుడు దానిని విశ్లేషణ కోసం తయారీదారుకు పంపడం ఆనవాయితీ అని చెప్పారు… అయితే, ఈ సారి భారతదేశంలోనే మొదటిసారిగా బ్లాక్ బాక్స్ డీకోడింగ్ ప్రక్రియ విజయవంతంగా జరిగిందని మంత్రి రామ్ మోహన్ నాయుడు వెల్లడించారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande