న్యూఢిల్లీ, 22 జూలై (హి.స) పార్లమెంట్ భవనం ఆవరణలో ప్రతిపక్ష ఎంపీలు నేడు నిరసన ప్రదర్శన చేశారు. లోక్సభ లో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్గాంధీ,సమాజ్వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సహా ప్రతిపక్ష ఎంపీలంతా ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంపీలు నినాదాలు చేశారు.
పార్లమెంట్ మకర ద్వారం ముందు ఎంపీల నిరసన ప్రదర్శన జరిగింది. బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ (SIR) పేరుతో ఓటర్ల జాబితాను సవరించడానికి వ్యతిరేకంగా వారు నిరసన వ్యక్తంచేశారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ పేరుతో ఎన్నికల సంఘం అధికార బీజేపీ వ్యతిరేక ఓటర్లను జాబితా నుంచి తొలగించిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..